Header Banner

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

  Fri Apr 25, 2025 08:33        Politics

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ ను ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అభియోగ పత్రం (ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్) నమోదు చేసింది. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇటీవల సస్పెండైన సునీల్ కుమార్, గతంలో సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం పేర్కొంది.



ప్రభుత్వం నమోదు చేసిన ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్‌లో ప్రధానంగా ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా, తీసుకున్న అనుమతికి భిన్నంగా పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలు మోపింది. మొత్తం ఆరు వేర్వేరు సందర్భాల్లో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు ప్రభుత్వం తన అభియోగ పత్రంలో వివరంగా పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: టెన్షన్... టెన్షన్! వైసీపీ నేతల్లో వణుకు! కీలక నిందితుడికి రిమాండ్!

 

ప్రభుత్వం పేర్కొన్న అభియోగాలు

1. 2024 మార్చి 1న జార్జియా వెళుతున్నట్లు అనుమతి పొంది, దానికి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లారని ప్రభుత్వం ఆరోపించింది.
2. 2023 సెప్టెంబర్ 2న ప్రభుత్వ అనుమతి లేకుండానే స్వీడన్ పర్యటనకు వెళ్లారని పేర్కొంది.
3. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న సమయంలో, 2023 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ మధ్య ప్రభుత్వానికి తెలియజేయకుండా అమెరికా పర్యటన చేశారని మూడో అభియోగం నమోదు చేసింది.
4. సీఐడీ చీఫ్‌గా బాధ్యతల్లో ఉండగా, 2022 డిసెంబర్ 14న జార్జియా వెళ్తున్నట్లు చెప్పి, యూఏఈకి వెళ్లినట్లు తేలిందని తెలిపింది.
5. 2021 అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా యూఏఈలో పర్యటించారని మరో ఆరోపణ చేసింది.
6. 2019 డిసెంబర్ 21న అమెరికా వెళ్లేందుకు అనుమతి తీసుకుని, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లారని ఆరో అభియోగంలో పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!



ఈ ఆరు అభియోగాలకు సంబంధించి, ప్రతిదానికి విడివిడిగా 30 రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని సునీల్ కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, ఈ అభియోగాలపై జరిగే విచారణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడానికి ప్రయత్నించినా, అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 



2019 అక్టోబర్ 24 నుంచి 2023 జనవరి 23 వరకు సీఐడీ చీఫ్‌గా... 2023 మార్చి 10 నుంచి 2024  జూన్ 20 వరకు ఫైర్ సర్వీసెస్ డీజీగా సునీల్ కుమార్ పనిచేశారు. ఈ కాలంలోనే సర్వీసు నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వం అభియోగాలలో పేర్కొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

 

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #YSRC #ExposeYSRC #SunilKumar #Cases #Shock #Politics